బొత్స సరిజోడు అంటున్న కళా...?

Update: 2022-02-02 15:30 GMT
కొత్త జిల్లాల విభజన కాదు కానీ టీడీపీలో వైసీపీలో కూడా రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు పొలిటికల్ గా  భారీ నష్టమే జరిగింది అంటున్నారు. ఆయనకు పట్టున్న నియోజకవర్గాలు వెళ్ళి కొత్తగా ఏర్పడుతున్న  పొరుగు జిల్లాల్లో కలసిపోయాయి.

దాంతో కళా రాజకీయ భవిష్యత్తు మీద టీడీపీలో చర్చ సాగుతోంది. కళా ఇక మీదట శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కంటిన్యూ చేస్తారా లేక పట్టున్న పక్క జిల్లాలకు వెళ్తారా అన్నది కూడా ఒక హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో అయితే విభజనతో కింజరాపు ఫ్యామిలీ మరింతగా బలపడిపోయింది.

ఇంకో వైపు చూసుకుంటే మాజీ మంత్రులు గుండా అప్పల సూర్యనారాయణ, గౌతు శివాజీ ఫ్యామిలీలకు పట్టు పెరిగింది. కళా వెంకట‌రావుకు మాత్రం ఒక్క  ఎచ్చెర్లతోనే కాస్తా రాజకీయ  బంధం ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా  అక్కడ చూస్తే కళాను నాన్ లోకల్ అనేస్తున్నారు. దాంతో  కళా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని తెలుస్తోంది. అదేంటి అంటే తనకు పట్టున్న పక్క జిల్లా అయిన విజయనగరానికే షిఫ్ట్ కావాలన్నదే  ఆ ప్లాన్ గా ఉందిట.

విజయనగరం జిల్లాలో రాజాం కలసింది. ఇక కళాకు రాజాంతో పాటు చీపురుపల్లిలోనూ పట్టుంది. పైగా అక్కడ కూడా ఆయన కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఆయన తమ్ముడు గణపతిరావు భార్య మృణాళిని ఎమ్మెల్యేగా ఒకసారి నెగ్గారు.   గత టీడీపీ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తమ్ముడు కొడుకు కిమిడి నాగార్జున విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయించాలనుకుంటున్నారు. అదే టైన్ లో కిమిడి కుటుంబానికి పట్టున్న చీపురుపల్లి నుంచి ఈసారి తానే బరిలోకి దిగాలని కళా వెంకటరావు ఆలోచిస్తున్నారని టాక్. ఇక్కడ నుంచి 2014లో  మృణాళిని పోటీ చేసి గెలిచారు. 2019లో నాగార్జున పోటీ చేసి ఓడినా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతకు ముందు ఇదే సీటు నుంచి కళా బంధువులే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

దాంతో కొత్త జిల్లలా విభజన జరిగితే విజయనగరానికి తరలిరావడం ద్వారా సరికొత్త రాజకీయం స్టార్ట్ చేయాలని కళా భావిస్తున్నారని అంటున్నారు. విజయనగరంలో కూడా తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీడీపీలో చూస్తే అశోక్ గజపతిరాజు, బొబ్బిలి రాజులు నాయకులుగా ఉన్నారు. దాంతో ఏపీ టీడీపీకి పూర్వ ప్రెసిడెంట్ గా సీనియర్ గా ఉన్న కళా ఇక్కడ చక్రం తిప్పితే సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ ఆయనకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారుట.

అలాగే పూర్వ వైభవంతో పాటు కొత్త కళ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి కళా కనుక చీపురుపల్లి నుంచి పోటీకి దిగితే వైసీపీ దిగ్గజ నేత బొత్స  సత్యనారాయణకు గట్టి పోటీ ఎదురుకాకతప్పదు, మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు అన్నది కూడా చెప్పలేరు కూడా. చూడాలి మరి కళా  పాలిటిక్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో.
Tags:    

Similar News