మల్లాది విష్ణు కటక్ లో దాక్కున్నాడా?

Update: 2015-12-12 11:33 GMT
విజయవాడ స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒడిశా రాష్ట్రం కటక్ లో ఉన్నట్లు సమాచారం. స్వర్ణబార్ లో కల్తీ మద్యం వల్ల మరణాలు చోటుచేసుకున్న అనంతరం అసులు ఆ బార్ తనది కాదని వాదించిన విష్ణు ఆ తరువాత పరారైపోయారు. ఆయన కోసం ఏపీ, తెలంగాణల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు కాళ్లకు బదులు బుర్రకు పనిచెప్పారు. విజయవాడ ప్రాంతీయులు ఎక్కువగా నివసిస్తున్న, వ్యాపారాలు చేస్తున్న ఒడిశా రాష్ట్రంపై దృష్టిపెట్టి దర్యాప్తు చేయడంలో విష్ణు కటక్ లో ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో ఆయన్న అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైపోయింది.

మరోవైపు ఈకేసులో విష్ణు తప్పించుకునే మార్గాలేమీ కనిపించడం లేదు. బార్ నిర్వహణ చూస్తున్న విష్ణు సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య నేరాన్ని అంగీకరించాడు. తమ బార్ లో మేనేజర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును పురమాయించి ఈ కల్తీకి పాల్పడుతున్నామని శ్రీనివాస్  పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. దీంతో కేసు చిక్కుముడి వీడింది. అయితే... విష్ణు కోసం ఆయన తమ్ముడు నేరం అంగీకరించారా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
Tags:    

Similar News