ఇక టీడీపీకి కాపుల రాం రాం!

Update: 2019-03-29 17:30 GMT
2014 ఎన్నికల్లో తెలగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ఓటర్లు ఇపుడు ఆ పార్టీని మళ్లీ బలపరిచే విషయమై పూర్తిగా పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పాడనే వారు టీడీపీ - బీజేపీ కూటమిని బలపరిచారు. అయితే, దీనివల్ల తమ సామాజికి వర్గానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. కాపు సాామాజిక వర్గం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాలు - విశాఖపట్నం - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం వారు కూడా ఉంటారు కాబట్టిి - కమ్మవారిని కాదని తమకు లాభం చేకూర్చే అవకాశం ఉండబోదని - ఫలితంగా తమకు పదవులుగానీ - కాంట్రాక్టులు - ప్రభుత్వం నుంచి ఇతర పనులుగానీ లభించే అవకాశం ఉండదని వారు అంటున్నారు. చట్టసభల్లో కాపుల ప్రాతినిధ్యం కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వైెఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ కే మద్దతు ఇవ్వాలని వారు అభిుప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ సారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వారు అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కంటే మెరుగైన రీతిలో జగన్ కాపులకు సీట్లు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం వారికి జగన్ 6 లోక్ సభ సీట్లు - 32 శాసనసభ సీట్లు ఇచ్చారని కేటాయించారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి కాపులు - బలిజలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఎంతో చిత్తశుద్ధి కనబరిచారని - ఈ సారి కాపులకు 31 - బలిజలకు 4 అసెంబ్లీ సీట్లు ఇచ్చారని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి కూడా కాపులకు సమున్నత గౌరవం ఇచ్చారు. ఇది ఓర్చుకోలేని అప్పటి కాంగ్రెస్ ఎం.పి. రాయపాటి శ్రీనివాస చౌదరి ప్రెస్ మీట్ పెట్టి మరీ అభ్యంతరం వ్యక్తం చేశారని - వైఎస్ కోస్తా ప్రాంతాన్ని వైఎస్ పూర్తిగా కాపులకు రాసిచ్చేశారంటూ ఆయన గగ్గోలు పెట్టిన సంగతిని వారు ప్రస్తావించారు.

టీడీపీ నేతలు మాత్రం తమ సామాజికవర్గానికి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని - తమ వారిని చాలా ఘోరంగా అవమానించారని కాపు నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది - టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కాపులపై - కాపు సామాజికవర్గానికే చెందిన సినీ నటుడు చిరంజీవిపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని వారు అంటున్నారు. తన తండ్రిలాగా, ...లాగా చిరంజీవి కూడా పార్టీపెట్టారని - ముఖ్యమంత్రి కావాలంటూ కలలు గన్నారని - అయితే,..తన తండ్రి కాలిగోటికి కూడా ఆయన సరిపోరని - ఆయన్ను లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానించబోనని - అసలు తాను పిలవాలంటే ఎవరికైనా ఓ స్టేటస్ ఉండాలని - బాలకృష్ణ వ్యాఖ్యానించారని - కాపు సామాజికవర్గానికి చెందిన తోటి నటుడు చిరంజీవిని బాలకృష్ణ అలా అవమానించారని వారు గుర్తు చేసుకుంటున్నారు. కమ్మరక్తం ఎక్కించుకుని ఉంటే చిరంజీవి సీఎం అయిఉండేవాడంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలను - కాపులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తదితరులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారు.

అంతే కాదు,..రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగినపుడు వేదికపై ఒక్క కాపునేతకు కూడా స్థానమివ్వలేదని వారంటున్నారు. జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే - కాపు నేతలకు మంచి మంత్రిపదవులు వస్తాయని - కాపుల కోటాలో ఒకరు కేంద్రమంత్రి కూడా కావచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఏ విధంగా చూసినా విశ్వసనీయతలేని చంద్రబాబును నమ్మడం కంటే - మాటతప్పని - మడమ తిప్పని జగన్ ను - వైఎస్ కుటుంబాన్ని నమ్ముకోవడం శ్రేయస్కరమని వారు నిర్ణయానికి వచ్చిచనట్టు సమాచారం.



Tags:    

Similar News