కర్ణాటక డ్రగ్స్ కేసుకు కేరళ గోల్డ్ కేసుతో లింకులు

Update: 2020-09-07 17:32 GMT
కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులో ఏకంగా ఆ రాష్ట్ర సీఎం ఆఫీసుతో లింకులు బయటపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది.

కర్ణాటక డ్రగ్స్ మాఫియా వ్యవహారంతో కేరళ బంగారం స్మగ్లింగ్ కు లింక్ ఉన్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. ఈ మేరకు ఎన్.సీ.బీ అధికారులు వివరాలు వెల్లడించాడు.

బెంగళూరు మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితుడు డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కేటి రమీన్ తో సంబంధాలు ఉన్నట్లు తేల్చారు. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు గుర్తించారు. మొదటి నుంచి ఈ రెండు కేసులకు సంబంధాలు ఉన్నట్టు బయటపడుతోందన్నారు.

కాగా తాజాగా కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు , నటుడు బినీష్ కొడియేరి పేరు కూడా కర్ణాటక డ్రగ్స్ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్ స్మగ్లర్ పెడ్లర్ బినీష్ పేరు వెల్లడించాడు. దీంతో కేరళ బంగారం స్మగ్లింగ్కేసుతో దీనికి సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా నటుడు బినీష్ కొడియేరి ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆరోపించారు.
Tags:    

Similar News