ఎన్నిక‌ల ముంగిట ప‌డిపోతున్న బీజేపీ గ్రాఫ్‌!

Update: 2023-04-17 14:00 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముంగిట అధికార బీజేపీకి గ్రాఫ్ ఢ‌మాల్ మంటోంది. కీల‌క నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు 60 మంది వ‌ర‌కు పార్టీకి రాంరాం చెప్పారు. పోనీ.. పోతేపోనీలే అనుకునే బ్యాచ్ కాదు. అంద‌రూ కూడా ఉద్ధం డులు.. వారు గెల‌వ‌డ‌మే కాకుండా..వ ఆరి వ‌ర్గాన్ని కూడా గెలిపించుకునే ల‌క్ష్యంతో ఉన్న‌వారు. గ‌త ఎన్ని క‌ల్లో వీరి అండ‌తోనే క‌ర్ణాట‌క‌లో బీజేపీ పాగావేసింది. అయితే.. ఇప్పుడు వీరికి టికెట్లు ఇవ్వ‌కుండా చేయ డంతో పార్టీ ఖాళీ అవుతున్న ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలావుంటే, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీని రాష్ట్రంలో డెవ‌ల‌ప్ చేసిన‌ నేత జగదీశ్ శెట్టర్ కూడా క‌మ‌లం గూటికి గుడ్ బై చెప్పారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన క‌నీసం 24 గంట‌లు కూడా కాకుండానే ఆయ‌న కాంగ్రెస్లో చేరారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల వ్యూహం ఫ‌లించ‌డం విశేషం.

నిజానికి కర్ణాటకలో బీజేపీని బలపరిచేందుకు పార్టీ కార్యకర్త స్థాయి నుంచి కూడా శెట్ట‌ర్‌ నిరంతరం శ్రమిం చారు. సంఘ్ ప‌రివార్ నుంచి బీజేపీ వ‌ర‌కు ఏకంగా 32 సంవ‌త్స‌రాల పాటు.. ప‌య‌నించారు. మ‌ధ్య‌లో సీ ఎం అయ్యారు.

అదే విధంగా రాష్ట్ర బీజేపీకి సార‌థ్యం వ‌హించారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే లింగాయ‌త్ వ‌ర్గాని కి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడిగా శెట్ట‌ర్‌కు పేరుంది. అలాంటి నాయ‌కుడికి కేంద్ర బీజేపీ నేత‌లు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీ ప‌రిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

'ఆదివారమే బీజేపీ పార్టీకి రాజీనామా చేశా. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరా. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్య మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తాను కాంగ్రెస్ చేరడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ నాకు ప్రతి పదవి ఇచ్చింది. పార్టీ కార్యకర్తగా బీజేపీ ఎదుగులదలకు నిరంతరం శ్రమించా' అని జగదీశ్ శెట్టర్ చెప్పారు. ఏదేమైనా ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కర్ణాట‌క‌లో ఆ పార్టీ ఓట‌మికి సంకేతాలుగానే భావించ‌వ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News