పెళ్ళికి వస్తే క్వారంటైన్ కి పంపిన పోలీసులు ..ఎక్కడంటే !

Update: 2020-05-16 06:45 GMT
దేశంలో మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మాస్కులు, భౌతిక దూరం తప్పని సరిగా అమలు అవుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌ కు తరలిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చినా , ఎందుకోసం వచ్చినా కూడా ఏ మాత్రం వారికీ సమయం ఇవ్వకుండా వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు.

తాజాగా బళ్లారి తాలూకాలోని అమరాపుర గ్రామంలో అనుమతి లేకుండా పెళ్లి నిర్వహించడంతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు పెళ్లికి హాజరు కావడంతో గురువారం రాత్రి టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి క్వారంటైన్ ‌కు తరలించారు. బంధువుల పెళ్లి కోసం విచ్చేసిన అనంతపురం జిల్లాకు చెందిన 11 మందిని క్వారంటైన్‌ కు తరలించడం తో అమరాపురలో నిర్వహిస్తున్న ఓ పెళ్లి వేడుకలో సందడి లేకుండా పోయింది.

వైరస్  కట్టడి చేసేందుకు బళ్లారి సరిహద్దున చెక్‌ పోస్టుల వద్ద గట్టి భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి బళ్లారిలోకి రాకుండా చెక్‌ పోస్టులపై నిఘా ఉంచారు. పెళ్లికొచ్చినా, పేరంటాలకు వచ్చినా క్వారంటైన్‌ కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ మహమ్మారి పూర్తిగా తగ్గిపోయే వరకు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండటం చాలామంచిది.
Tags:    

Similar News