ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి చెందినవిగా చెబుతున్న ఆడియో టేపు ఉదంతంపై.. వాటిని ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్‌కు.. సాక్షి ఛానల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాక్షికి పోస్ట్‌లో పంపి.. టీ న్యూస్‌కి మాత్రం ఏపీ పోలీసులు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. దీనిపై టీ న్యూస్‌తో పాటు.. పలు జర్నలిస్టులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షానికి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ కట్టాశేఖర్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు. ఈ ఉదంతానికి సంబంధించి టీ న్యూస్‌కి ఇచ్చినట్లే కొన్ని దినపత్రికలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసిందని ఆయన ఫిర్యాదు చేశారు.
టీ న్యూస్‌కి నోటీసులు ఇవ్వటం.. మీడియా హక్కుల్ని కాలరాయటంగా అభివర్ణించారు. మీడియాపై దాడికి యత్నించి.. చంద్రబాబు తప్పు చేశారని దుయ్యబట్టారు. నోటీసులు వెనక్కి తీసుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా.. నోటీసులు వెనక్కి తీసుకోవటమే లక్ష్యమైతే..ఇలాంటి హెచ్చరికల అవసరం ఉంటుందా?