కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడైన డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విచ్చేశారు. తెలంగాణ వ్యవహారాలపై సమీక్ష జరిపేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన..శుక్రవారం ఉదయం ఏపీకి బయలుదేరారు.
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ పీసీసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. అయితే.. ఆయన వాహనంతో పాటు.. ఆయనకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ వాహనాన్ని కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సెక్యూరిటీ వాహనం దెబ్బ తినగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు.
ఈ ఘటన నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డిగ్గీ రాజాకు ఏమీ కాలేదు. ఎదురుగా వచ్చిన కావేరీ బస్సు.. డిగ్గీ రాజా సెక్యూరిటీ వాహనాన్ని నేరుగా వచ్చి గుద్దింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టటంతో పాటు.. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.