తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వచ్చారు. 51వ డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ప్రధానమంత్రికి గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. మోడీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లారు. డీజీపీల సదస్సులో శనివారం ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సదస్సును ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రులు - బీజేపీ నేతలను పరిచయం చేసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ భుజంపై చేయి వేసిన ప్రధానమంత్రి అక్కడి సమూహం నుంచి పక్కకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ కూడా వెంట ఉండగా కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రత్యేక భేటీలో బహుశా పెద్ద నోట్ల రద్దు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు భావిస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ను ప్రధానమంత్రి మోడీ వెంట బెట్టుకొని వెళ్లి మరీ ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/