మాయదారి వైరస్ కట్టడి చర్యలు, లాక్‌డౌన్, మహమ్మారి వ్యాప్తి వంటి అంశాలతోపాటు వ్యవసాయ, రాష్ట్ర ఆర్థిక విధానంపై సోమవారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. అనంతరం సోమవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖపై కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా రైతులకు కీలక సలహాలు, సూచనలు చేశారు. నియంత్రిత పద్ధతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇక నుంచి రైతులు ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని సూచించారు. దీంతో వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు లాభాలు పొందుతారని పేర్కొన్నారు.
ప్రభుత్వం రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తామని.. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలి అన్నది ప్రభుత్వమే మ్యాపింగ్ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి.. తెలంగాణ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత టిపికల్ ల్యాండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటుందని, అందుకే ఇక్రిసాట్ ఇక్కడ నెలకొల్పారని చెప్పారు. నల్లరేగడి, ఎర్ర రేగడి, క్షార, తెల్ల నేలలు రాష్ట్రంలో ఉన్నాయని, మనది సమశీతోష్ణ మండలం అని, ఏడాదిలో సగటున 900 మి.మీ వర్షపాతం ఉంటుందని, వరదలు, తుఫానులు, బలమైన ఈదురుగాలులు ప్రకృతి వైపరీత్యాలు వంటివి చాలా తక్కువగా సంభవిస్తాయని వివరించారు.
సమగ్ర వ్యవసాయ విధానం.. సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఎకరాల చొప్పున 2,604 క్లస్టర్స్‌ను ఏర్పాటుచేశామని కేసీఆర్ తెలిపారు. ఈ క్లస్టర్స్ అన్నింటిలో రాబోయే రోజుల్లో రైతు వేదికల (గోదాము)ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇకపై నియంత్రిత పద్దతిలోనే రాష్ట్ర వ్యవసాయ విధానం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, వ్యాపార సంస్థలు, రైతులు, రైస్ మిల్లర్స్.. ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులతో అనేక చర్చలు చేసి కొత్త విధానం రూపొందింంచినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు ఏయే పంటలు వేయాలని సూచించారు.
వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది పండించాలని రైతులకు పిలుపునిచ్చార. స్వతహాగా 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేయవచ్చని పేర్కొన్నారు. మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 1.20 లక్షల ఎకరాల్లో పసుపు పండుతుందని.. దాన్ని కొనసాగించవచ్చునని, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో 2.50లక్షల ఎకరాల వరకు ఎండుమిర్చి సాగు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 3.50 లక్షల ఎకరాల్లో సోయాబీన్స్ పంటలను వేసుకోవచ్చని ప్రకటించారు. ఇక ఇప్పటికే ఉన్న మామిడి తోటలు, బత్తాయి తోటలు కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే చెబుతుంది.. నియంత్రిత పద్దతిలో వ్యవసాయానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పత్తి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రాజెక్ట్ కింద, బోర్ల కింద కూడా పత్తిని సాగుచేయాలని సూచించారు. గతేడాది రెండు పంటలు కలిపి కోటి 23 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని.. ఈసారి మరో 10లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో మక్క (మొక్కజొన్న) పంట అసలే వద్దని చెప్పారు. మక్కకు బదులు వానాకాలంలో కందిని సాగు చేస్తే లాభదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు అందుతుందని స్పష్టం చేశారు. నియంత్రిత వ్యవసాయ విధానంలోనూ అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారని.. దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి మ్యాపింగ్,ప్రోగ్రామింగ్ సిద్దం చేస్తోందని తెలిపారు.