తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివైన రాజకీయ నేత. ఈ అభిప్రాయం ఏర్పడటానికి చాలా కారణాలున్నాయి. అందులా తాజాది ఏమిటంటే.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకుండానే స్థానిక ఎన్నికలను జరిపిస్తూ ఉండటం!
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఏమైనా తేడా కొట్టాయంటే.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించడం తేలిక ఏమీ కాదు. ఓటమి భయంతో ఆ ఎన్నికలను వాయిదా వేసుకొంటూ పోవాల్సి వస్తుంది. అందుకే తెలివిగా కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకుండానే స్థానిక ఎన్నికలను వచ్చేలా చూసుకున్నారు. వీటి పోలింగ్ పూర్తి అయిపోతే ఫలితాల సంగతి తర్వాత!
ఇప్పటికే తన వైరి పక్ష పార్టీలు వరస ఎన్నికలతో - వాటిల్లో ఎదురైన ఓటమితో నీరసపడ్డాయి. ఇలాంటి తరుణంలోనే ఈ ఎన్నికలూ జరిగిపోతే ఒక పనైపోతుందనేది కేసీఆర్ లెక్క.
ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. జీహెచ్ ఎంసీ ఎన్నికల విషయంలో ఇప్పుడు కేసీఆర్ కు కొంత కన్ఫ్యూజన్ నెలకొందని సమాచారం. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీలు కూడా మంచి స్థాయిలో పెర్ఫామ్ చేశాయనే అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కు తదుపరి జీహెచ్ఎంసీ ఎన్నికల టెన్షన్ పట్టుకుందట. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ బాగానే సీట్లను సంపాదించుకుంటే.. వెంటనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు కూడా తీసుకొచ్చేయాలనేది ఒక ఆలోచన అట. ఇదే ఊపులో ఆ ఎన్నికలూ పూర్తి అయితే రాబోయే నాలుగేళ్లూ మరే ఎన్నికల టెన్షన్ ఉండదు.
అయితే లోక్ సభ పోల్ లో తేడాలు కనిపిస్తే.. కాంగ్రెస్సో - బీజేపీనో పుంజుకుందనే సంకేతాలు వస్తే అప్పుడు జీహెచ్ ఎంసీ ఎన్నికలను తక్షణమే నిర్వహిచడమా వద్దా.. అనే సందేహంతో ఉన్నారట కేసీఆర్. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీలు ఉనికిని చాటితే.. వాటికి కొత్త ఉత్సాహం వస్తుంది!
ఫలితంగా జీహెచ్ ఎంసీ ఎన్నికల నాటికి అవి మళ్లీ పాత శక్తులను సంతరించుకున్నా సంతరించుకుంటాయి. వాస్తవానికి అయితే జీహెచ్ ఎంసీ ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాల్సిన అవసరం లేదు. వాటికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియలన్నింటినీ వీలైనంత త్వరగా ముగించేయాలన్న లెక్కలతో ఉన్న కేసీఆర్ కు మాత్రం ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో ముడిపడిన టెన్షన్ కలుగుతోందని.. పార్టీ శ్రేణులతో ఆయన ఈ విషయంలో సమాలోచనలు సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.