కంగారు పెట్టిస్తున్న కేసీఆర్

Update: 2017-08-31 04:05 GMT
పేద‌లు కూడా గౌర‌వంగా బ‌త‌కాలి. ఉన్న ఒక్క గ‌దిలో ముస‌లీ - ముత‌కా - పిల్లా - పెద్దా ఎలా క‌లిసి జీవిస్తారు. అందుకే అర్హుల‌యిన పేద‌లంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం డ‌బ‌ల్ బెడ్ రూం ఇండ్ల‌ను నిర్మించి ఇస్తాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల హామీ ఇచ్చారు. అయితే ఆచ‌ర‌ణ‌లో ఈ ప‌థ‌కం ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా అమ‌లు కాలేదు. ఖ‌మ్మం జిల్లాలో భారీగా డ‌బ‌ల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. హైద‌రాబాద్ ఐడీహెచ్ - మెద‌క్ జిల్లాలో ఎర్ర‌వ‌ల్లి మిన‌హా ఈ ప‌థ‌కం భారీగా అమ‌లు కాలేదు.

నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్ని అని ఇండ్లు కేటాయించినా నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రాలేదు. దీంతో మార్పులు చేర్పులు చేసి పెద్ద ఎత్తున జిల్లాల‌లో ఈ ఇండ్ల నిర్మాణం మొద‌లు పెట్టారు. ఇక తాజాగా హైద‌రాబాద్ లో జీహెచ్ ఎంసీ ఆధ్వ‌ర్యంలో ఏకంగా ల‌క్ష ఇండ్ల నిర్మాణానికి టెండ‌ర్లు ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం. జీహెచ్ ఎంసీ చ‌రిత్ర‌లోనే నిలిచిపోయే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ లోని 33 బ‌స్తీల‌ను తొల‌గించి ఈ మొత్తం ఇండ్ల‌ను నిర్మించ‌నున్నారు.

డ‌బ‌ల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విఫ‌లం అయింద‌ని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేసి ల‌బ్దిపొందాల‌ని విప‌క్షాలు భారీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయితే విడ‌త‌ల వారీగా ప్ర‌ణాళికాబ‌ద్దంగా పథ‌కాల‌ను అమ‌లు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు డ‌బ‌ల్ బెడ్ రూం ఇండ్ల మీద దృష్టి సారించారు. దీంతో ఉన్న ఈ విమ‌ర్శ‌కు కూడా ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త లేకుండా కేసీఆర్ చెక్ పెట్టార‌ని ప్ర‌తిప‌క్షాలు కంగారు ప‌డుతున్నాయి.
Tags:    

Similar News