ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని సంధిస్తూ తన ప్రత్యర్థి పార్టీల అడ్రస్ లను గల్లంతు చేసిన తెలంగాణ అధికారపక్ష అధినేత కేసీఆర్ తాజాగా భారీ ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తప్ప విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల్ని కారు ఎక్కించిన కేసీఆర్ ఫోకస్ తాజాగా టీ కాంగ్రెస్ మీద పడిందని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ గుత్తా.. ఎమ్మెల్యే కోమటి రెడ్డి ఆయన సోదరుడిని కారు ఎక్కించే ప్రయత్నం చేయటం.. దీనికి గుత్తా ఓకే చెప్పటం ఓపక్క కలకలం రేపుతుండగా.. తాజాగా కేసీఆర్ ప్లాన్ కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు బయటకు పొక్కాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గులాబీ కారు ఎక్కించేందుకు నల్గొండ ఎంపీ గుత్తాతో పాటు.. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన వివేక్.. వినోద్ లను రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన తెర వెనుక పనుల్నీ పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. సంప్రదింపులు.. చర్చలు ముగిసి.. కారు ఎక్కటం మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే శనివారం వీరంతా టోకుగా కారు ఎక్కేస్తారని.. అదే జరిగితే.. తెలంగాణ కాంగ్రెస్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయమని చెబుతున్నారు. ఈ నలుగురు నేతలు కానీ కారు ఎక్కిన పక్షంలో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేనన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.