హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి ఏర్పాట్లు గట్టిగానే సాగుతున్నాయి. ఈ గురువారం హుజూర్ నగర్ లో కేసీఆర్ ప్రచార భేరీ మోగించనున్నారు. భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టుగా టీఆర్ ఎస్ ప్రకటించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతల్లో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార భేరీ భారీ స్థాయిలో జరగనుందని ఆయన అంటున్నారు.
కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ట్రెంట్ సెట్టర్ కాబోతోందనిఅంటున్నారు. కేసీఆర్ మాటలను వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్ నగర్ ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారని రాజేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఇదైతే నిజమే. కేసీఆర్ చాన్నాళ్లుగా మాట్లాడటం లేదు. ప్రత్యేకించి లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ వివిధ అంశాల గురించి - తన ప్రత్యర్థుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు.
అసెంబ్లీలో ప్రసంగాలు ఉన్నా అవి అంతంత మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలూ చాలానే ఉన్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎందుకు గెలిపించాలో కూడా కేసీఆర్ చెప్పాల్సి ఉంది.
ప్రత్యర్థులపై వాగ్బాణాలను సంధించడంలో కేసీఆర్ కు సాటి వచ్చే వారు లేరిప్పుడు. అయితే ఇప్పుడు వేళ్లన్నీ కేసీఆర్ వైపు చూపుతున్నాయి. చంద్రబాబును తిట్టి బయటపడానికీ లేదు. మరోవైపు ఆర్టీసీ సమ్మె సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి కేసీఆర్ ఏం చెబుతారు? ఏం మాట్లాడతారు? అనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశం.