కేదరనాథ్ పూజారి వింత ప్రదక్షిణలు ..దేనికోసమంటే !

Update: 2020-06-22 17:30 GMT
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదరనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది గుడి చుట్టూ వినూతనంగా ప్రదక్షిణ చేశారు. చేతులపై తలకిందులుగా నిలుచుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ రోజుల్లో వేలాదిమంది ఉత్తరాదిన ఉన్న చార్ ధామ్ యాత్రకు వెళ్తుంటారు. కేదారనాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను దర్శనం చేసుకొని వస్తుంటారు. ఇందులో కేదారనాథ్ అత్యంత ఎత్తులో, హిమాలయ సానువుల్లో ఉంటుంది. అయితే , ఇప్పుడు వైరస్ కారణంగా కేదారనాథ్ కు వెళ్లే భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది.

దేవాలయాల్లోని పూజారులు, అర్చకులు దేవుని సన్నిధిలోనే ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. ఫిట్నెస్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే పూజారులందు కేదారనాథ్ పూజారి వేరు. ఆయన ఫిట్నెస్ చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కేదారనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది చేతులు కింద, కాళ్ళు పైకి పెట్టి చేతులతో నడుస్తూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయన ఇలా ప్రదక్షిణ చేయడం విశేషం . యోగ లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఫీట్ సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News