కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేరళ సీఎం

Update: 2023-01-18 11:54 GMT
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అరుదైన మద్దతు లభించింది. కేరళ సీఎం పినరయి విజయ్ తన సంపూర్ణ మద్దతును కేసీఆర్ కు తెలియజేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు. కేంద్రం వైఖరితో రాజ్యాంగాన్ని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు.  ఖమ్మం సభ దేశానికి దిక్సూచీ లాంటిదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాచరికాన్ని తరిమికొట్టారని.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపడుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విజయన్ స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు. కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోందన్నారు.

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్దతుల్లో కూలదోస్తోంది. కేంద్రం వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని విజయన్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు  చేపడుతోందని.. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయన్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేంగా పోరాడుతామన్నారు.

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని.. రైతులకు సరైన మద్దతు ధర లభించట్లేదన్నారు. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది? గంగా ప్రేక్షాళన చేస్తామని నమ్మక ద్రోహం చేశారన్నారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోంది. బీజేపీ ను గద్దె దించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేహం ఇస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు.

తొలిసారిగా నిర్వహించిన  బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పనరయి విజయ్, సీబీఐ నేత డి. రాజా, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్  తదితరులు హాజరు కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News