షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మీద కాసింత అయోమయం.. మరికాస్త సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఒక రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు కరోనా బారినపడి మరణించటం షాకింగ్ గా మారింది. ఛత్తీస్ గఢ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాండే కరోనాతో మృతి చెందటం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. దీనికి కారణం.. ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత కరోనా సోకి మరణించటమే ఇందుకు కారణం.
మార్చి నెలాఖరులో సుభాష్ పాండే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్నారు. అనంతరం ఆయన బాగానే ఉన్నారు. మూడు రోజుల క్రితం ఆయనకు దగ్గు..జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన్ను రాయపూర్ ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవటంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో.. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు.
ఏడాది క్రితం కరోనా బారిన పడిన ఆయన హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొంది కోలుకున్నారు. అలాంటి ఆయన వ్యాక్సిన్ తీసుకొని.. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత కరోనా బారిన పడటం.. ఈసారి తీవ్ర అనారోగ్యానికి గురై మరణించటం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఆయన మరణం కీలక స్థానాల్లో ఉన్న వారిలో భారీ చర్చకు దారి తీసింది.