యువీ పూనకం పట్టడా ఏంటీ.. ఆరు సిక్సులు బాదిన పోలార్డ్

Update: 2021-03-04 05:50 GMT
వెస్టిండీస్  ఆల్​రౌండర్​ కిరన్​ పోలార్డ్​ స్టేడియంలో నిప్పులు కురిపించాడు. ఆరుబంతుల్లో ఆరుసిక్సులు కొట్టి దుమ్ముదులిపాడు. ఇండియన్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ ను గుర్తుకు తెస్తూ స్టేడియం నలు వైపులా సిక్సులు బాది ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. గత రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్​లో పొలార్డ్​ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్​లో అతడు మొత్తం కొట్టింది 38 పరుగులు .. అందులో 36 ఆరు పరుగులు సిక్సుల రూపంలోనే ఉండటం గమనార్హం.

బంతి ఎలా వచ్చినా పోలార్డ్​ దాన్ని బౌండరీ అవుతలికి బాదడంతో ప్రేక్షకులు, టీవీ చూస్తున్న క్రికెట్​ అభిమానులు ఫిదా అయిపోయారు. గతంలో మనదేశపు ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​, దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్​ గిబ్స్​ అకౌంట్​లో మాత్రమే ఈ రికార్డు ఉంది. ప్రస్తుతం పొలార్డ్​ వారి సరసన చేరాడు.  గతరాత్రి శ్రీలంకతో వెస్టిండీస్  టీ20 మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​ లో అఖిల ధనంజయ  వేసిన ఆరో ఓవర్​ లో పోలార్డ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. ఆ తర్వాతి ఓవర్​లోనే ఓటయ్యాడు. ఈ క్రమం లో విండిస్​ 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలో ఛేదించింది.

ఆ మ్యాచ్​లో తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 131/9 స్కోర్​ సాధించింది. పాతుమ్​ నిస్సంక  34 బంతుల్లో 39 కొట్టాడు. డిక్​ విలాల 29 బంతుల్లో 33 పరుగులు సాధించి టాప్​ స్కోరర్లుగా నిలిచారు.అనంతరం ఛేదనకు దిగిన విండీస్​ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్ల లో లక్ష్యాన్ని చేరుకున్నది. పోలార్డ్​ కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేశాడు.  ఒకే ఓవర్​ లో ఆరు సిక్సులు  బాదాడు. దీంతో విండీస్​ ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
Tags:    

Similar News