ఇరాన్ చీఫ్ హతం: ట్రంప్ భయం.. అజ్ఞాతంలోకి కిమ్

Update: 2020-01-07 04:16 GMT
కొరకరాని కొయ్యగా మారి అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సొలేమానిపై వైమానిక దాడి జరిపి అమెరికా హత్య చేసి సంగతి తెలిసింది.దీంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తోకజాడిస్తే లేపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ కు హెచ్చరికలు పంపారు. ఇరాన్ కూడా ఇరాక్ లోని అమెరికా బలగాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనను వ్యతిరేకించిన ఇరాన్ చీఫ్ ను చంపించిన నేపథ్యంలో ఈ కోవలోనే ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేస్తూ హెచ్చరికలు పంపిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉల్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ట్రంప్ తనను కూడా చంపేస్తారేమోనన్న భయంతో ఆయన గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లి దాక్కున్నట్లుగా సమాచారం.

అమెరికాతో కయ్యానికి దిగుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇప్పుడు ట్రంప్ భయానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన డిసెంబర్ 31నుంచి ఎక్కడ ఉన్నారన్నది గోప్యంగా ఉంచారు. 2019 డిసెంబర్ 31న చివరి రోజు వర్కర్స్ పార్టీతో సంబరాలు చేసుకున్న కిమ్ ఆ మీటింగ్లోనే ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడే ఇరాన్ సైనిక చీఫ్ ను ట్రంప్ చంపించేశారు. దీంతో చావు భయంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఇక ఉత్తర కొరియాతో అణు ఒప్పందం చేసుకునే గడువు కూడా ముగిసిపోయింది. ట్రంప్ చెప్పిన గడువు ముగియడంతో తనపై చర్యలు తీసుకుంటారని భయపడి కిమ్ కూడా సైలెంట్ అయ్యి ఎక్కడో దాక్కొని ఉంటాడని భావిస్తున్నారు.
Tags:    

Similar News