తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన రాజకీయ ఎజెండాపై ఒకింత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో జేఏసీ కుమ్మక్కైందంటూ టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన బదులిస్తూ...ప్రజా కూటమిగా ఉన్న జేఏసీ - ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తే తప్పేంటీ?' అని ప్రశ్నించారు. వివిధ అంశాలపై పార్టీలను కలవక తప్పదని, దీంట్లో ఏ మాత్రం తప్పులేదన్నారు. జేఏసీ కార్యాలయంలో తమ సొంత ప్రచార వేదిక అయిన 'జేఏసీ' వెబ్ సైట్ ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోదండ రాం ఈ విషయాలు వెల్లడించారు.
తెలంగాణ జేఏసీ రాష్ట్రంలోని బాధితుల పక్షాన, వారి గొంతుక వినిపించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోందని కోదండరాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిపారు. నిర్బంధ చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై గళం విప్పేవారిపై విమర్శలు సహజమేనని కోదండరాం వ్యాఖ్యానిస్తూ తనపై వస్తున్న విమర్శలను లైట్ తీసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఎటువంటి ఒత్తిడులు ఎదురైనా అంబేద్కర్ మార్గంలో రాజ్యాంగ బద్దంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం నిర్ధిష్టంగా, వ్యూహత్మకంగా ఉండాలని, ఈ పోరాటం ద్వారా ప్రభుత్వం నుంచి కచ్చితంగా సమాధానం రాబట్టే విధంగా ఉండాలని ఆయన చెప్పారు. కాగా వివిధ సమస్యలపై త్వరలో తాము కార్యాచరణ రూపొందించనున్నట్లు కోదండరాం తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకించడంతోపాటు విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జనవరి 7 నుంచి 'విద్యా పరిరక్షణ యాత్ర'ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను నిలిపివేసి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకానికి సంబంధించిన 'ఫిషరీస్ పాలసీ'పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించామని, దాని పై విస్తత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/