ఇంగ్లాండ్ క్రికెటర్లతో మనవాళ్లకు వరసగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బట్లర్, కోహ్లీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గొడవ చెలరేగింది. తాజాగా పాండ్యా, టామ్ కరన్ మధ్య గొడవ చోటుచేసుకున్నది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కృనాల్ పాండ్యా వన్డే సీరిస్‌తోనే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే 31 బంతుల్లో 58 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సులతో మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు.
అయితే ఇన్సింగ్స్ చివర్లో టామ్ కరన్‌కు.. కృనాల్ పాండ్యాకు మధ్య వివాదం చెలరేగింది. కరన్‌కు పాండ్యా కూడా దీటుగా సమాధానం చెప్పాడు.ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన టామ్ కరన్ బౌలింగ్‌లో ఐదో బంతిని ఫీల్డ్ అంపైర్ పద్మనాభన్ వైడ్‌గా ప్రకటించాడు. దాంతో టీమిండియాకి ఓ ఎక్స్ట్రా వచ్చింది.
అయితే ఆ టైంలోనే టామ్ కరన్ కృనాల్ పై నోరు పారేసుకున్నాడు. ఈ వైడ్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని సర్దిచెప్పినా వివాదం సద్దుమణగలేదు. అయితే కృనాల్ కూడా ఏదో సైగ చేశాడు.
మధ్యలోకి కీపర్ బట్లర్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత పెద్దదైంది.
బట్లర్ కృనాల్ వైపు సీరియస్‌గా చూస్తూ రెచ్చగొట్టాడు. అంతేకాక టామ్ కరన్‌కు ఏదో సూచనలు ఇచ్చాడు.
డగౌట్‌లో కూర్చుని ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత టీవీ అంపైర్‌కు కంప్లైంట్ ఇచ్చాడు. తొలి వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా 317 పరుగుల భారీ స్కోరు చేయగా లక్ష్య ఛేదనలో తడ బడ్డ ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓటమి చెందింది.