కేంద్రమాజీ మంత్రి, బీజేపీనేత - రెబల్ స్టార్ కృష్ణంరాజు రెచ్చిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఏపీలో బీజేపీ నేతలపై దాడులు చేస్తున్న టీడీపీ నేతల తీరును తూర్పార పట్టారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో టీడీపీ భౌతిక దాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందన్నారు. ఇలా చేస్తే ఆ పార్టీకి సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంధించే ఐదు ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానమే లేదని కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. వాటికి పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడన్నారు. టీడీపీ నేతలు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. కన్నాపై చెప్పులు వేసి రౌడీయిజం చేయిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలు ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని కృష్ణం రాజు అన్నారు. వరి సహా ఇతర పంటలకు కేంద్రం మద్దతు ధర భారీగా పెంచడంపై కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. పంట కొనుగోలు భారం రాష్ట్రాలపై పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు.