కేటీఆర్ మ‌ళ్లీ మ‌న‌సు దోచేశారు

Update: 2017-05-16 05:04 GMT
అధికారం చేతిలో ఉంటే క‌ళ్లు నెత్తి మీద‌కు వ‌చ్చేసే రోజులు. రోడ్డు మీద ఏదైనా జ‌రిగితే.. త‌మ‌కు ఎందుకులే అన్న‌ట్లుగా త‌మ దారిన తాము పోయే పాడు రోజులివి. ఇలాంటి రోజుల్లో.. అర్థ‌రాత్రి అప‌రాత్రి అన్న తేడా లేకుండా.. ఎప్పుడేం జ‌రిగినా? ఎక్క‌డేం జ‌రిగినా? త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే స్పందించే త‌త్త్వం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లో కాస్త ఎక్కువే.

ఆ మ‌ధ్య‌న అర్థ‌రాత్రి వేళ తాను వ‌స్తున్న మార్గంలో యాక్సిడెంట్ జ‌రిగిన వ్య‌క్తిని చూసినంత‌నే ర‌య్యిన పోయే త‌న కాన్వాయ్ ను ఆపేసి మ‌రీ.. స‌ద‌రు వ్య‌క్తిని త‌న కాన్వాయ్ వాహ‌నంలో ఆసుప‌త్రికి త‌ర‌లించి పెద్ద మ‌న‌సు చాటుకున్న కేటీఆర్‌.. తాజాగా అదే త‌ర‌హాలో మ‌రోసారి మ‌న‌సు దోచుకున్నారు.

నోవాటెల్ హోట‌ల్లో ప‌ని చేసే వెంక‌ట్రావ్ అనే ఉద్యోగి సోమ‌వారం హోట‌ల్ కు వెళుతుండ‌గా.. బైక్ మీద నుంచి కింద‌ప‌డి గాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో అటుగా వెళుతున్న మంత్రి కేటీఆర్ త‌న కాన్వాయ్ ను ఆపేసి.. త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి స‌ద‌రు వ్య‌క్తిని ఇచ్చి.. త‌న కాన్వాయ్ వాహ‌నంలో ద‌గ్గ‌ర్లోని మ్యాక్స్ క్యూర్ ఆసుప‌త్రిలో చేర్పించారు.

అక్క‌డితో త‌న ప‌ని అయిపోయిన‌ట్లుగా భావించ‌కుండా.. స‌ద‌రు ఆసుప‌త్రికి ఫోన్ చేసిన కేటీఆర్‌.. వెంక‌ట్రావ్ ఆరోగ్య ప‌రిస్థితిని వాక‌బు చేయ‌టంతో పాటు.. అత‌డికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. మ‌రి.. ఇంత ప‌ని చేసిన మంత్రి కేటీఆర్ కు క‌నీసం థ్యాంక్స్ చెప్ప‌టం.. శ‌భాష్ అన‌టం త‌ప్పేముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News