దక్షిణాది సెంటిమెంట్ ను బయటకు తీస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-04 09:48 GMT
ప్రధానితో భేటీ ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చి.. ఢిల్లీకి పయనమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి వచ్చేశారు. తాజాగా జరిపిన ఢిల్లీ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హై ప్రొఫైల్ పెళ్లికి.. తన పంటి సమస్యకు సంబంధించి వైద్యుడ్ని సంప్రదించటం మినహా దేశ రాజధానిలో చేసిందేమీ లేదు.

ప్రధాని మోడీతో భేటీ కానున్నట్లు చెప్పినప్పటికీ.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా తర్వాతి పర్యటనలో మోడీని కలుస్తానని హైదరాబాద్ కు వచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇలాంటివేళ.. ఆయన కుమారుడు కమ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా సీఐఐ నిర్వహించిన సదస్సుకు హాజరైన కేటీఆర్ ప్రధాని మోడీపై విమర్శలు చేయటమే కాదు.. కేంద్రం తీరును తప్పు పట్టారు.

ఇప్పటికే పలువురు అధినేతలు మోడీ సర్కారు తీరును విమర్శిస్తూ.. ఆయన ప్రభుత్వం సౌత్ ను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు చేశారు. దీనికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణను కేంద్రం పట్టించుకోవటం లేదని.. రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావటం లేదన్నారు.

చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని.. అభివృద్ధి కేవలం నాగపూర్ కేనా? అంటూ ఘాటు వ్యాఖ్య చేసిన ఆయన.. దక్షిణాదిపై కేంద్రం వివక్షను ప్రదర్శిస్తున్నట్లు మండిపడ్డారు. డెవలప్ మెంట్ ను కేవలం గుజరాత్.. మహారాష్ట్ర.. చెన్నై లాంటి కొన్ని నగరాలకే పరిమితం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినా.. లభించలేదన్న మాట వినిపిస్తున్న వేళలోనే మోడీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
Tags:    

Similar News