ఓవైపు రాజకీయాలు.. మరోవైపు ప్రైవేటు కార్యక్రమాలు.. ఇంకోవైపు సోషల్ మీడియాలో బిజీబిజీగా ఉంటే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. తనకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో వార్తల్లోకి వచ్చారు కేటీఆర్.
1999లో తాను తీసుకున్న ఫోటోను తాజాగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జీన్స్.. షర్ట్ తో పాటు.. హ్యాండ్స్ సగానికి పైనే మడిచేయటం.. మీసకట్టు.. నిండైన హెయిర్ స్టైల్ లో అప్పటి ప్రేమికుల దినోత్సవం ఫేం కునాల్ ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఫోటోను 1999 ఫిబ్రవరి 14న అంటే..ప్రేమికుల దినోత్సవం రోజున తీసుకోవటం విశేషం. ఒక బల్ల మీద కేటీఆర్ యాక్టివ్ గా కూర్చొని ఉంటే.. అదే బల్ల మీద కేటీఆర్ పక్కన మరో యువకుడు కూర్చొని ఉన్నాడు. కాకుంటే.. ఆ కుర్రాడు ఫోటో తీసే సమయానికి కళ్లు మూసుకోవటంతో నిద్ర పోతున్నట్లుగా ఉంది. అయితే.. ఆ కుర్రాడి వివరాల్ని కూడా కేటీఆర్ వెల్లడించారు.
ఫోటోలో తన పక్కన ఉన్నది మహేశ్ ఓదెల అని చెప్పారు. యంగ్ గా ఉన్నప్పటి కేటీఆర్ ఫోటోకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు నెటిజన్లు. పలువురు ఈ ఫోటోను లైక్ చేస్తుంటే.. కొందరు మాత్రం కొన్ని సినిమాలకు సైన్ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ ఫోటో స్ఫూర్తితో తమకు చెందిన పాత ఫోటోల్ని షేర్ చేసుకొని.. పలువురు పాత జ్ఞాపకాల్లో మునిగిపోయారు.
ఇంతకూ 20 ఏళ్ల నాటి ఫోటో కేటీఆర్ సాబ్ కు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఏ సందర్భంలో ఈ ఫోటో తీసుకున్నారు? అయినా.. కళ్లు మూసుకొని ఉన్న తన స్నేహితుడి ఫోటోను కట్ చేసి పెట్టకుండా.. పాత ఫోటోను యథాతధంగా పోస్ట్ చేయటం వెనుక ఏదైనా రీజన్ ఉందా కేటీఆర్?