బందరు పోర్ట్ పేరుతో ఇప్పటికే మచిలిపట్నంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుండటంపై ఆగ్రహజ్వాలలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదే రీతిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం వేగంగా కదులుతుండటంపై ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పార్టీకి ఏళ్లుగా ఓట్లు వేస్తున్న వారిని వైసీపీ నేతలుగా చిత్రీకరించడంపై అసంతృప్తి తెలుపుతున్నారు. మచిలీపట్నంలోని స్థానిక కుమ్మరిగూడెంలోని ఇటుకల బట్టీల వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్థానికులు మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు మా జీవనాధారంపై దెబ్బకొట్టి రోడ్డుకీడిస్తారా..? అంటూ ఇండోర్ స్టేడియం ప్రతిపాదిత ప్రాంత కుమ్మరిగూడెం వాసులు అధికార పక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1971లో నాటి ప్రభుత్వం కులవృత్తి చేసుకునేందుకు మచిలీపట్నంలోని సర్వే నెం. 180 - 181లోని 22 ఎకరాల భూమిని కేటాయించిందని - నాటి నుండి నేటి వరకు ఆ భూమిలో ఇటుకలు తయారు చేసుకుని జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా తమ భూమిని స్టేడియం నిర్మాణానికి ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరారని - దీనికి అభ్యంతరం తెలిపిన తామంతా హైకోర్టుకు వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నామన్నారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అధికారులు దౌర్జన్యంగా భూములు ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఘటనలో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు అండగా నిలబడితే తమను కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తులుగా మంత్రి కొల్లు రవీంద్ర - ఎంపీ కొనకళ్ల నారాయణరావులు పేర్కొనడం బాధాకరమన్నారు. తామంతా మొదటి నుండి టీడీపీ సానుభూతిపరులమేనన్నారు. గత మున్సిపల్ - సాధారణ ఎన్నికల్లో తామంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవటంతో పాటు పార్టీ సభ్యత్వాలు కూడా తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచిన తమను నేడు ఆ పార్టీ వ్యక్తులే రోడ్డుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవనాధారం కోసం పోరాడుతున్న తమను ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులుగా పేర్కొనడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ మనుషుల్ని కూడా తమ పార్టీ వ్యక్తులు కాదని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 200 కుటుంబాలు ఇటుకల తయారీపై ఆధారపడటంతో పాటు 2వేల మంది ప్రత్యక్షంగా - పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. స్టేడియం నిర్మాణం జరిగితే తామంతా రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమ భూముల కోసం ఎంతటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నెల 9వతేదీన కలెక్టరేట్ ను ముట్టడించనున్నట్లు వారు తెలిపారు. కాగా ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుమ్మరిగూడెం వాసులు అనేక ఏళ్లుగా టీడీపీకి అండాదండగా ఉన్నారని పేర్కొంటూ నిరసన తెలుపుతున్నారని ప్రతిపక్ష నేతలుగా పేర్కొనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/