పిల్లలకు చదువులు చెప్పే టీచర్లు సమ్మె లాంటి వాటిల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? తమ సత్తాను తక్కువగా అంచనా వేస్తూ.. కడుపు మండే నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. సర్కారుకు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయితే.. టీచర్లు ఎంతలా రియాక్టు అవుతారటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు. విజయవాడలో జరుగుతున్న కొత్త పీఆర్సీ వ్యతిరేక నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్న క్రమం తెలిసిందే.
ఈ విషయాల్ని ముందుగానే పసిగట్టిన కర్నూలు జిల్లాకు చెందిన టీచర్ల టీం.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించింది. తమ తెలివితో పోలీసుల కళ్లుగప్పి విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. నిరసనకు నేరుగా వచ్చేసిన తీరుతో పోలీసులు అవాక్కు అయ్యే పరిస్థితి. ఇంతకూ వారు చేసిందేమంటే.. తాము ప్రయాణించే బస్సుకు.. పెళ్లి సందడి బ్యానర్ తగిలించేశారు. అందుకు తగ్గట్లే.. ఎంచక్కా తయారైన వారు.. చూసినంతనే పెళ్లికి వెళుతున్నట్లే ఉండిపోయారు.
విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. తామేమిటో చెప్పేశారు. ఇలా.. ప్రభుత్వానికి ఊహించని విధంగా షాకులిచ్చిన కర్నూలు జిల్లా ఉపాధ్యాయ సంఘం వారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మీ చేతిలో ఉన్న అధికారంతో మమ్మల్ని అడ్డుకుంటే.. మాకున్న తెలివితే.. మిమ్మల్నిఎలా బోల్తా కొట్టించాలో పాఠాలు చెప్పే మాకు తెలీదా? అంటూ ఉపాధ్యాయులు విరుచుకుపడుతున్నారు.