కనీసం ఎన్టీఆర్ ఘాట్ ను కూడా పట్టించుకోవడం లేదు

Update: 2019-01-18 09:13 GMT
ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో ప్రస్తుతం అవన్నీ తుంగలో తొక్కారని ఎన్టీఆర్ సతీమణి - వైఎస్సాఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్ధంతిని సందర్భంగా  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్యుడని లక్ష్మీపార్వతి కొనియాడారు. ఆయన తెలుగు జాతి కోసం ఎంతో సేవ చేశారని తెలిపారు. కాగా ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్లు మాత్రం యథేచ్ఛగా తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదిచూసి తలుచుకున్నప్పుడల్లా తన గుండెల్లో మంట చల్లారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడిచేందుకు కూడా తన కళ్లలో నీళ్లు లేవని వాపోయారు.

ఎన్టీఆర్ ను రాజకీయాల కోసం వాడుకునే నేతల తీరును చూసి ఆయన ఆత్మ శాంతించడం లేదన్నారు. ఆయన ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉందని వాపోయారు. ఎన్టీఆర్ కు మహిళలంటే ఎంతో గౌరవం ఉండేదని తెలిపారు. ఎల్లప్పుడు తెలుగు ఆడపడచులను తన అక్కా చెల్లెళ్లు అంటూ సంబోధించేవారని గుర్తు చేశారు. కాగా నేటీ టీడీపీ నేతలకు మహిళలంటే కనీసం గౌరవంలేదని ఆరోపించారు. మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

నిత్యం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ రాజకీయ లబ్ధిపొందే నేతల సైతం ఎన్టీఆర్ ఘాట్ ను పట్టించుకున్న పాపానా పోలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్ ఓ వైపు పెచ్చులూడుతుందని తెలిపారు. ఇది ఎన్టీఆర్ చాలా అవమానం అని అన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించి ఎన్టీఆర్ ఘాట్ కు మరమ్మతులు చేయించాలని మీడియా ముఖంగా లక్ష్మీ పార్వతి కోరారు.



Full View
Tags:    

Similar News