కేరళపై కదిలిస్తున్న తెలంగాణ యువకుడి పాట

Update: 2018-08-23 06:31 GMT
కేరళలో వర్షం సృష్టించిన విలయం యావత్ ప్రపంచాన్ని కన్నీరుపెట్టించింది. కేరళ కష్టాన్ని చూసి స్పందించనివారే లేరు. కేరళ కష్టాన్ని చూసి ఇకనైనా నీ ప్రతాపం ఆపు అంటూ వర్షాన్ని వేడుకుంటూ తెలంగాణకు చెందిన ఓ కవిగాయకుడు రాసి ఆలపించిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌ లో పోస్ట్ చేసిన తొలిరోజునే దీన్ని 3 లక్షల మందికిపైగా చూశారు. రెండు రోజులయ్యేసరికి ఇది 6.5 లక్షల వ్యూస్ సాధించింది.
  
‘‘కేరళకు అండగా నిలిచే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో’’ అంటూ ఆగస్టు 20న ఈ వీడియో పోస్ట్ చేశారు. మహబూబాబాద్‌కు చెందిన లలిత మ్యూజిక్ సంస్థ దీన్ని రూపొందించి ‘‘లలిత ఆడియోస్ అండ్ వీడియోస్’’ అనే తమ యూట్యూబ్ చానల్‌ లో పోస్ట్ చేసింది.
  
కందకట్ల రామకృష్ణ అనే యువకుడు ఈ పాట రాయడంతో పాటు స్వయంగా తానే పాడారు. ‘‘వానమ్మ ఆపవె నీ వేగము.. కేరళ నేలపై ఎందుకంత ఆగ్రహం’’ అని వానమ్మను ప్రశ్నిస్తూ రామకృష్ణ రాసిన పాటలో సాహిత్యం కేరళలో పరిస్థితిని - ప్రజల కష్టాలను కళ్లకు కట్టడంతో పాటు.. ఎంతో ఆర్ద్రంగా పాడడంతో ఆ పాట చాలావేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News