మోడీని చాలా పెద్ద మాట అనేసిక లాలూ

Update: 2016-04-15 09:37 GMT
ప్రధాని నరేంద్రమోడీని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. మోడీ ఈ దేశానికి పట్టిన దరిద్రమని... ఆయన శకునం మంచిది కాదని అన్నారు. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దేశం కరవు - నీటి కొరతతో సతమతమవుతోందని ఆయన అన్నారు.
   
ప్రధాని మోడీని విమర్శించిన లాలూ పనిలో పనిగా ప్రధానికి సన్నిహితుడైన యోగా గురు రాందేవ్ బాబాను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు.  రామ్ దేవ్ బాబా గురువు కాదని, ఆయన ఒక పెట్టుబడిదారు అని చెప్పారు.  ఆయన యోగా మాస్టర్ కాదని... ఇండస్ర్టియలిస్టని చెప్పుకొచ్చారు. ఎవరు ఎప్పుడు పవర్ లో ఉంటే రాందేవ్ బాబా వారిని పట్టుకుని తిరుగుతారని.. గతంలో ములాయం వెంట తిరుగుతూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతూ పబ్బం గడుపుకొనేవారని... ఇప్పుడు మోడీ పంచన చేరి ఆయనకు నచ్చేలా మాట్లాడుతూ... నిత్యం పొగడ్తల్లో ముంచెత్తుతూ ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు.
   
కాగా మోడీపై దుశ్శకునమంటూ విమర్శలు కురిపించిన లాలూపై భాజపా వర్గాలు మండిపడుతున్నాయి. లాలూ వంటివారికి మోడీని విమర్శించే అర్హత లేదని అంటున్నారు.
Tags:    

Similar News