ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధి సమ్మోహన శక్తి పనిచేసినట్లు లేదు. ప్రియాంకకు సమ్మోహన శక్తి ఉందని, ఆమెవల్ల పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు తెగ చెప్పేసుకున్నారు. అయితే తాజా ఫలితాలు చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ తరపున కేవలం ఒకే ఒక్క అభ్యర్ధి లీడ్ లో ఉన్నారు. మరి చివరివరకు ఆధిక్యంలోనే ఉండి గెలుస్తారో లేకపోతే మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోతారో తెలీదు.
2017 ఎన్నికల్లో పార్టీకి కనీసం 7 సీట్లన్నా ఉండేవి. ఇపుడు దాదాపు అవికూడా పోయాయి. పార్టీ గెలుపోటములను పక్కన పెట్టేస్తే గెలుపుకోసం ప్రియాంక పడిన కష్టంమాత్రం మామూలుగా లేదు. కొన్ని వందల రోడ్డుషోలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నో నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. నరేంద్రమోడిని టార్గెట్ చేసుకుని వందలాది సభల్లో ప్రసంగించారు. ప్రియాంక ఎంత కష్టపడినా ఉపయోగంలేకపోయింది.
విచిత్రమేమిటంటే ప్రియాంక డోర్ టు డోర్ క్యాంపెయిన చేసినపుడు చుట్టుపక్కల ఊర్లనుండి జనాలు విపరీతంగా వచ్చారు. అయితే అలా వచ్చిన వారిలో చాలమంది ఓట్లేసినట్లు లేదు. ఏదో ప్రియాంకను చూడటానికి వచ్చాము..వెళ్ళిపోయాము అన్నట్లే జరిగింది. ఇందుకనే కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు.
నిజానికి యూపీలో కాంగ్రెస్ వైభవం కోల్పోయి దశాబ్దాలవుతోంది. పోయిన వైభవాన్ని తిరిగి సాదిద్ధామని ప్రియాంక ఎంత కష్టపడినా ఉపయోగం లేకపోయింది.
పార్టీ నేతలమధ్య బాగా ముదిరిపోయిన అంతర్గత కలహాలు, నేతల మధ్య ఆధిపత్య గొడవలు, అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలు అన్నీ కలిసి ప్రియాంక కష్టాన్ని బూడిదపాలు చేసేశాయి. అధికారం కోల్పోయి దశాబ్దాలవుతున్నా నేతల మధ్య వివాదాలు మాత్రం ఏమీ తగ్గలేదు.
ప్రియాంక ఛార్మింగ్ ముందు అవేవి జనాలు పట్టిచుకోరని అనుకున్నారు. కానీ స్ధానిక గొడవల ముందు ప్రియాంక ఛార్మింగ్ ఎందుకు పనిచేయలేదన్న విషయం ఇపుడు బయటపడింది.