అన్యాయం జరిగిందంటూ ఆగ్రహించిన వేళ.. అక్రోశంతో నోటి నుంచి వచ్చే మాటలు చాలావరకు గుండె లోతుల్లో నుంచి వస్తుంటాయి. అది ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ కు మాత్రమే కాదు.. ఎవరికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. వేదనలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. ఆ తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత మాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ కాలం పోరాడిన అధినేతగా సుపరిచితుడైన ఆయన.. పలు సందర్భాల్లో ఎన్నో కలల్ని.. ఆదర్శాల్ని వల్లె వేసేవారు.
సిస్టంలోని లోపాల్ని ప్రస్తావించేవారు. తనలాంటి సాప్నికుడి చేతికి అధికారం వస్తే.. పాలనా రథాన్ని ఎలా నడిపేది చెప్పేవారు.అప్పట్లో ఇలాంటి మాటలు విన్న వారందరికి నిజమే కదా? ఇలా కదా రాష్ట్రాన్ని పాలించేది? అన్న భావన కలిగేది. ఇప్పుడు ఆ ముచ్చటా తీరింది. దాదాపు ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితుల్లోకి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు వచ్చిన మార్పులు ఒక ఎత్తు అయితే.. ఏ నోటితో అయితే మహోన్నత ఆదర్శాల్ని వల్లె వేశారో.. ఇప్పుడు అదే నోటితో చెప్పలేనన్ని తప్పులు చేస్తున్న కేసీఆర్ ను ఏమనాలి?
ఆదర్శాలు చెప్పటం తెలికే కానీ వాటిని పాటించటం అంత సులువు కాదన్నది తెలిసిందే. సీఎం కేసీఆర్ తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిజానికి చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై తన పని తాను చేసుకుంటూ పోతారు. అనవసరంగా వివాదాల్ని క్రియేట్ చేసి కెలుక్కోరు. అయినప్పటికీ.. సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళ సైతో పడని పరిస్థితి. మొదట్లో బాగానే ఉన్నట్లుగా అనిపించినా.. రోజులు గడిచే కొద్దీ కేసీఆర్ తీరులో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
మొన్నటికి మొన్న రిపబ్లిక్ వేడుకుల సందర్భంగా గవర్నర్ ను బయటకుఅడుగు పెట్టనీయకుండా రాజ్ భవన్ కే పరిమితం చేయటం.. ఆ తర్వాత రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు ఎవరూ హాజరు కాకపోవటం తెలిసిందే. మేడారంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలోనూ గవర్నర్ తమిళ సై విషయంలో ప్రోటోకాల్ పాటించలేదన్న వివాదం గురించి తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత మంట పుట్టేలా చేస్తోంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆనవాయితీ ప్రకారం తొలుత రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఆ పై గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు చర్చను నిర్వహిస్తారు.
అయితే.. ఇటీవల గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇగో కానీ అలాంటిదే మరొక దాని కారణంగా తాను వల్లె వేసే మహోన్నత ఆదర్శాల్ని వదిలేసి.. గవర్నర్ తో పేచీ పెట్టుకోవటం దేనికి నిదర్శనం? ఒకవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళతానని చెబుతూ.. దేశాన్ని ఉద్దరిస్తామని చెప్పే సీఎం.. గవర్నర్ తో లొల్లిపెట్టుకోవటం.. సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్ సెషన్ ను నిర్వహించటం దేనికి నిదర్శనం? అన్నదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే వారెవరు?