విమోచన వార్: కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై

Update: 2022-09-15 08:37 GMT
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాజ్ భవన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ సర్కార్ కు పోటీగా గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ విమోచన దినోత్సవం సందర్భంగా ఉద్యమ పోరాటాలు.. త్యాగాలు అనే అంశంపై విశ్వవిద్యాలయ విద్యార్థులతో వ్యక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు గవర్నర్ ఏకంగా రాజ్ భవన్ లోనే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుండం హీట్ పెంచింది. సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు.దీనిలో పాల్గొనే వారు పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.

ఇక కేంద్రహోంమంత్రి అమిత్ షా శనివారం పరేడ్ గ్రౌండ్ లో విమోచన వేడుకలను పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నారు. దీనికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఏకంగా రాజ్ భవన్ లోనే ఈ వేడుకలకు రెడీ కావడం సంచలనమైంది.

ఇక కిషన్ రెడ్డి చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్, అసెంబ్లీ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. స్వయంగా బుల్లెట్ నడపడానికి కిషన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇక సెప్టెంబర్ 17న మోడీ బర్త్ డే కావడంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది.

ఇప్పటికే గవర్నర్ తమిళిసై తీరుతో కేసీఆర్ కోపం నషాళానికి అంటింది. ఆమెకు ప్రొటోకాల్ ఇవ్వకుండా రాష్ట్రంలో ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదు.

దీంతో గవర్నర్ రాజ్ భవన్ లోనే ప్రజాదర్భార్ పెట్టేశారు. ఇప్పుడు ఏకంగా విమోచన దినోత్సవాన్ని కూడా రాజ్ భవన్ లో పెట్టి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు. దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News