ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ నియోజకవర్గం లోని త్రిపురాంతకం మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా స్థానిక మద్యం దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే 10 రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో త్రిపురాంతకం మండల కేంద్రంలోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమన్నారాయణ, ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్ సీఐలు ఎన్.తిరుపతయ్య, లీనా ఆధ్వర్యం లో దాడులు నిర్వహించారు.
దీనిపై పూర్తి వివరాలని చూస్తే .. ప్రభుత్వ మద్యం దుకాణం నెంబర్: 08048లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా మద్యం కొనుగోలు చేయగా అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది అని సీఐలు తెలిపారు.
ఆ మద్యం దుకాణం లో పని చేస్తున్న సేల్స్ మెన్ లు ఒక మద్యం సీసా పై MRP ధర కంటే రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. అలాగే దుకాణంలో కొన్ని మందు బ్రాండ్ లు ఉన్నప్పటికి కూడా కొందరికి మాత్రమే ఇస్తూ , స్టాక్ అయిపోయిందని చెబుతున్నట్లు తెలిపారు. దుకాణం సూపర్ వైజర్ ను ఫోన్ లో సంప్రదించగా అందుబాటు లో లేనని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్ల సమక్షంలో మద్యం గోదాము తాళాలు పగులగొట్టి గోదాములోని నిల్వను తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. అలాగే దుకాణంలో ఉన్న నిల్వకు నగదు ను తనిఖీ చేయగా రూ.1370 నగదు అదనం గా ఉందని చెప్పారు. దీనితో మద్యం దుకాణాన్ని సీజ్ చేసి , వారిని అదుపులోకి చేసినట్లు తెలిపారు.