శంఖుస్థాపన అంటే ఎన్నిసార్లు చేస్తారు? ఆమోదం పొందిన పనులకే నిధులు మంజూరు చేస్తే ఆ ఘనత ఎవరికి దక్కుతుంది? పైగా ఇలాంటి పనులకు తమ ఘనత అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? తాజాగా ఈ ప్రశ్నలను అధికార పార్టీకి ఎదురవుతున్నాయి.
యాదగిరిగుట్ట-వరంగల్ హైవేకు నిధులు మంజూరు అవడం పట్ల తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, కేంద్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీ నేతలు సంబర పడుతున్నారు. అయితే ఇందులో అసలు మతలబును కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ విషయంలో వాస్తవాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని, కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపిందని అన్నారు.