`ప‌ద్మావ‌తి`ని నిషేధించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం!

Update: 2017-11-21 01:30 GMT
ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌తి` చిత్రం విడుద‌లపై పెను దుమారం రేగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విడుద‌లైతే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి....కేంద్రానికి లేఖ రాశారు. ఆ చిత్రంలో రాణి ప‌ద్మిని దేవిని కించ‌ప‌రిచేలా ఉన్న స‌న్నివేశాలు తొల‌గించేవ‌ర‌కు విడుద‌ల‌ను ఆపాల‌ని - 'పద్మావతి'ని రీసెన్సార్ చేయాలని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే..... సమాచార - ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఆ సినిమా విడుద‌ల‌పై తీవ్ర అభ్యంతారాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో విడుద‌ల‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వ‌యోకామ్ 18 ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ, రాజ్ పుత్ ల ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు.

రాజ్ పుత్ వర్గానికి చెందిన నేతలు మ‌ధ్య‌ప్ర‌దేవ్ ముఖ్య‌మంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఆ సినిమాను నిషేధించాల‌ని కోరారు. వారి విన్న‌పానికి సానుకూలంగా స్పందించిన చౌహాన్‌..... మధ్యప్రదేశ్ లో ప‌ద్మావ‌తిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మ‌రోవైపు, ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొణేల‌ తలలపై రూ.10 కోట్ల నజరానా ప్రకటించిన బీజేపీ నేత సూరజ్ పాల్ అముకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూరజ్ పాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ ప్ర‌క‌టించారు. రాజ్యాంగం ప్రకారం సూరజ్ పాల్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నా తమకు సంబంధం లేదని, ఈ ప్ర‌కారం అతడికి షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.
Tags:    

Similar News