విమానాశ్రయ సిబ్బందికి ఊహించని షాకిచ్చిన పాజిటివ్ వ్యక్తి!
విమానాశ్రయ సిబ్బందికి పాజిటివ్ సోకిన ఓ యువకుడు ఊహించని రీతిలో షాకిచ్చాడు. విమానంలో ప్రయాణించిన అనంతరం తనను క్వారంటైన్ కేంద్రానికి పంపాలని సిబ్బందిని కోరాడు. అయితే ఎందుకు పంపాలి? వైరస్ లక్షణాలు ఏవీ లేవని సిబ్బంది ప్రశ్నించగా అతడు జేబులో నుంచి వైరస్ పాజిటివ్ రిపోర్టును చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. వెంటనే అప్రమత్తమై అతడిని క్వారంటైన్ కేంద్రానికి పంపారు. అయితే అతడు విమానంలో ప్రయాణించడంతో మిగతా ప్రయాణికులు.. విమాన సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు వైరస్ వ్యాపించేదేమోనని భయపడుతున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి గువాహటి మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. అతను కోల్‌కతా విమానాశ్రయంలో తనను క్వారంటైన్ కేంద్రానికి పంపాలని పట్టుపట్టాడు. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అధికారులు నిరాకరించారు. దీంతో అతను వెంటనే.. ‘చూడండి. ఇది నా కొవిడ్-19 పాజిటివ్ రిజల్ట్ రిపోర్ట్’ అంటూ జేబులో నుంచి కాగితం తీసి చూపించాడు. అది చూసి అధికారులకి ఏమనాలో తెలియని పరిస్థితి. నిజానికి బెంగాల్ కు ఢిల్లీ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు లేవు. దీంతో ఆ వ్యక్తి గువాహటి చేరుకొని, అక్కడి నుంచి కోల్‌కతా వచ్చాడు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన అతను రెండు విమానాలు మారి కోల్‌కతా చేరుకోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.