ఢిల్లీ గార్గి కాలేజీ లో జరిగిన తాజా ఉదంతం గురించి తెలిసిందే. గురువారం జరిగిన కాలేజీ వార్షికోత్సవంలో భాగంగా అల్లరిమూకలు విద్యార్థినులను చూస్తూ హస్తప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. గురువారం రోజు రాత్రి క్యాంపస్లోకి చొరబడ్డ దాదాపు 30-35 మంది మూక విద్యార్థినులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల వైపు చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డారు. క్యాంపస్ లో విద్యార్థినులను వెంబడించి దాడికి దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వారు క్యాంపస్ లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.
ఈ గార్గి ఘటన పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. మన బిడ్డలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యం లో ఆ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు విచారణ మొదలు పెట్టి , సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
దేశ రాజధాని పరిసరాలకు చెందిన 10 మందిని ఈ కేసులో ప్రధాన నిందుతులుగా గుర్తించారు. వారిపై పోలీసులు ఐపీసీ 452, 354, 509, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని ప్రశ్నించారు. మరో వైపు కాలేజీ సిబ్బందిని కూడా విచారణ బృందం ప్రశ్నించింది. సీనియర్ పోలీస్ అధికారిణి గీతాంజలి ఖండెల్వాల్ ఆధ్వర్యం లో కేసు విచారణ జరిగింది. మరోవైపు ఈ ఘటనపై మరో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా కాలేజీ కి తమ బృందాన్ని పంపి విచారణ జరిపిస్తోంది.