జెరూసలెం మత్తయ్య. ఈ పేరు చాలా మంది జ్ఞాపకాల్లో ఇంకా ఉండేఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డిని ఇరికించిన ఓటుకు నోటు కేసులోని ప్రధాన ముద్దాయిల్లో ఒకరైన మత్తయ్య సరికొత్త మాటలు నేర్చాడు. ఒకవైపు ప్రత్యేక హోదా అంటూ జగన్, మరోవైపు బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఇంకోవైపు ప్రపంచ స్థాయి రాజధాని అంటూ చంద్రబాబు వారికే సాధ్యమైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తెలుగు ప్రజలకు సినిమా చూపిస్తోంటే నేనెందుకు తగ్గాలి అనుకున్నాడేమో.. మన మత్తయ్య. తానుకూడా కొత్త రకం సినిమా చూపించడానికి రెడీ అయిపోయాడు.
గురువారం మీడియాతో మాట్లాడిన మత్తయ్య పసందైన మాటలు చెప్పాడు. వివిధ చర్చీల్లో తానూ - క్రైస్తవ సోదరులూ కలిసి ప్రార్థనలు చేసిన కారణంగా కేసీఆర్ - చంద్రబాబు - కేటీఆర్ ముగ్గురూ జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారంటూ బాంబు పేల్చాడు. పైగా తన ప్రార్థనలవల్లే రెండు ప్రభుత్వాలు ఓటుకు నోటు - పోన్ ట్యాపింగ్ కేసుల సంక్షోభం నుంచి బయటపడ్డాయని లేకుంటే చంద్రబాబు - కేసీఆర్ అరెస్టుతో ప్రభుత్వాలు కుప్పగూలిపోయేవని మత్తయ్య చెప్పాడు.
చంద్రబాబు - కేసీఆర్ మధ్య సఖ్యత ఏర్పడటంలో సహకరించిన రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సోదరులకు మత్తయ్య కృతజ్ఞతలు తెలిపాడు. వారి ప్రార్థనలే సీఎంల మధ్య కొత్తగా స్నేహాన్ని చిగురింపచేశాయని ముక్తాయించాడు ముత్తయ్య. దళితులు - క్రైస్తవుల సంక్షేమానికి ఇద్దరు సీఎంలూ కృషి చేయాలని కూడా మత్తయ్య డిమాండ్ చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆంగ్లో-ఇండియన్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కూడా ముత్తయ్య డిమాండ్ చేశాడు. ఏపీలో చర్చీలను - క్రేస్తవ స్మశానాలను - పాస్టర్లను కాపాడ్డానికి చర్యలు తీసుకోవాలని కూడా కోరాడు.
ఇక పనిలో పనిగా తెలంగాణలో ఒక క్రిస్టియన్ భవన్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ముత్తయ్య టీఆరెస్ ప్రభుత్వాన్ని కోరాడు. జెరూసలెంకి క్రిస్టియన్ల యాత్రకు ఆర్థిక సహకారం కూడా అందజేయాలని డిమాండ్ చేసాడు. మొత్తం మీద ముత్తయ్య రాజకీయ నేతలకు భిన్నంగా జనాలకు కాత్త ప్రత్యేకరకం సినమా చూపించాడు మరి.