మ‌రో సంచ‌ల‌నం..మాయ‌-అఖిలేష్ జ‌ట్టు

Update: 2017-04-16 09:08 GMT
రాజ‌కీయాల్లో మ‌రో అనూహ్య చ‌ర్య జ‌రిగింది. శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అన్న‌ట్లుగా...బ‌ద్ధ‌శ‌త్రువులు ఇద్ద‌రు ఒక తాటిపైకి వ‌స్తున్నారు. బీహార్ లో ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ - జేడీయూ అగ్ర‌నేత నితీశ్ కుమార్ 2016లో ఏక‌మైన‌ట్లే మ‌రో పున‌రేకీక‌ర‌ణ తెర‌మీదకు వ‌చ్చింది. బీహార్‌ లో వ‌లే బీజేపీని ఎదుర్కునేందుకు మ‌రో పొత్తు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ - ఎస్పీ తదితర పార్టీలు జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ బీజేపీని నిరోధించేందుకు ఇతర పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. ఈవీఎంలపై నమ్మకం పోయిందని అఖిలేశ్‌ యాదవ్ తెలిపారు. ఇకపై బ్యాలట్ పేపర్ విధానంలో అన్ని ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News