ఏపీలో పోలీసులపై వలస కూలీల దాడి.. తీవ్ర ఉద్రిక్తత !

Update: 2020-05-04 07:00 GMT
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ ‌డౌన్ లో నేటి నుండి కొన్ని ‌ సడలింపు  అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో కూలీలు పెద్ద ఎత్తున ఒకేసారి  రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోలీసులపై వలసకూలీలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తమ రాష్ట్రాలకు తమను తిరిగి పంపాలంటూ  కొవ్వూరు జాతీయ ప్రధాన రహదారి పై జార్ఖండ్ , బీహార్ , ఛత్తీస్ ఘడ్ , ఒడిశా కి  దాదాపు 300 మంది కూలీలు  ఆందోళనకు దిగారు. అయితే, ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేవరకు వారిని తిరిగి పంపబోమని పోలీసులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వస్థలాలకు పంపాల్సిందేనంటూ వలస కూలీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఏపీలో పలు ప్రాంతాల్లోనూ జనాలు, కూలీలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. 
Tags:    

Similar News