షర్మిల పార్టీపై గంగుల.. తీవ్ర వ్యాఖ్యలు

Update: 2021-02-16 15:30 GMT
తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల పార్టీ పెట్టే అంశం కొత్త రచ్చకు తెర తీస్తోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై మొదట్లో ఎవరూ పెద్దగా మాట్లాడింది లేదు. పార్టీ ఏర్పాటుపై షర్మిల పెద్ద ఎత్తున కసరత్తు చేయటం.. ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న వేళ.. తెలంగాణ అధికారపక్ష నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ అంశం చుట్టూ మాత్రమే తిరిగిన షర్మిల పార్టీ వ్యవహారం.. తాజాగా ఆంధ్రా.. తెలంగాణ అన్న అంశాల్ని తెర మీదకు తీసుకొస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. జగనన్న బాణం వస్తోందని.. ఆ తర్వాత మెల్లగా జగన్ వస్తాడని.. ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తారన్నారు.

తెలంగాణలో మళ్లా కొట్లాటలు తప్పవని.. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్ర సమైక్యం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా నేతలు నీళ్లు.. కరెంటును ఎత్తుకుపోతారన్నారు. రాష్ట్రాన్ని రక్షించేసత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. గంగుల చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరింతమంది నేతలు ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉందంటున్నారు. మరి.. ఈ వ్యాఖ్యలకు షర్మిల చెప్పే మాటలేమిటి? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.


Tags:    

Similar News