ప్రాణాలు కాపాడిన మంత్రి మ‌ల్లారెడ్డి..!

Update: 2019-06-04 05:26 GMT
స‌ర‌దాగా న‌వ్విస్తూ.. కొన్నిసార్లు మోతాదు మించిన కామెడీ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి.  అలాంటి ఆయ‌న తాజాగా ఒక విష‌యంలో ఆయ‌న స్పందించిన తీరు ప‌లువురి అభినంద‌న‌లు పొందుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

బాలాన‌గ‌ర్ రాజు కాల‌నీకి చెందిన 55 ఏళ్ల బాల‌స్వామి మేస్త్రీగా ప‌ని చేస్తుంటారు. సోమ‌వారం సైకిల్ మీద బాలాన‌గ‌ర్ వైపు వెళుతున్నాడు. ఇదిలా ఉంటే.. న‌ర్సాపూర్ చౌర‌స్తా వ‌ద్ద వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన లారీ అత‌డ్ని ఢీకొట్టింది. అదుపు త‌ప్పిన లారీ వెనుక టైరు కింద ప‌డిపోవ‌టంతో బాల‌స్వామి కాలు నుజ్జునుజ్జుయింది.

లారీని ఆపేందుకు స్థానికులు ప్ర‌య‌త్నించేస‌రికి.. డ్రైవ‌ర్ అక్క‌డ నుంచి పారిపోయాడు. ఇదిలా ఉంటే.. అదే స‌మ‌యంలో బోయిన్ ప‌ల్లి నుంచి కూక‌ట్ ప‌ల్లి వైపు వెళుతున్న మంత్రి మ‌ల్లారెడ్డి.. యాక్సిడెంట్ చూసి ఆగారు.కారు నుంచి దిగిన ఆయ‌న ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. గాయాల‌బారిన ప‌డ్డ బాల‌స్వామిని హుటాహుటిన త‌న కాన్వాయ్ లోని వాహ‌నంలో ఎక్కించుకున్న ఆయ‌న‌.. వెంట‌నే త‌న‌కు చెందిన మ‌ల్లారెడ్డి ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

అక్క‌డి వైద్యుల‌తో స్వ‌యంగా మాట్లాడిన మల్లారెడ్డి.. బాధితుడికి త‌క్ష‌ణ వైద్య సాయాన్ని అందించారు. బాధితుడికి ప్రాణ‌హాని లేద‌ని చెప్పిన అనంత‌రం అక్క‌డ నుంచి వెళ్లారు. ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌ను చూసి వెంట‌నే స్పందించిన మంత్రి మ‌ల్లారెడ్డి తీరును ప‌లువురు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News