కేటీఆర్ ముందు లైఫ్ స్కిల్స్ చెప్పిన మ‌ల్లారెడ్డి

Update: 2022-02-17 14:30 GMT
ఫుల్ జోష్‌లో ఉన్న స‌మ‌యంలో తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి ప్ర‌సంగం అంటే శ్రోత‌ల‌కు ఎంత పండ‌గో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక త‌న ముందు విద్యార్థులు ఉంటే ఆయ‌న‌లో ఎక్క‌డ‌లేని ఉత్సాహం వ‌స్తుంది. హైద‌రాబాద్‌లో టీ టవర్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు మల్లారెడ్డి.

ఈ సందర్బంగా స్టూడెంట్స్ ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రతీ ఒక్క స్టూడెంట్ తన లాగా కష్టపడి పైకి రావాలన్నారు.  అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు తాను పాలు అమ్మినని, పూలు అమ్మినని..  సండే, మండే తేడా లేకుండా కష్టపడ్డానని మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు.  ఇవాళ సీఎం కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల మంత్రిని అయినా అని అన్నారు.  

‘స్కూల్స్ పెట్టిన కాలేజీలు పెట్టినా, ఎంపీ అయిన, ఎమ్మెల్యే అయిన, మంత్రి అయిన. కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల ఈ స్టేజి లో ఉన్న..ఇపుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అయిన, టాప్ టెన్ లో ఉన్న``అంటూ త‌న గురించి మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విద్యార్థుల‌కు ఈ సంద‌ర్భంగా హిత‌బోధ చేశారు. ``స్టూడెంట్స్ టైమ్, డబ్బులు వేస్ట్ చేయద్దు... ప్రేమలో పడద్దు, దొంగ ఫ్రెండ్షిప్ చేయద్దు`` అని సూచించారు.

కేటీఆర్ స్మార్ట్ మినిస్టర్... ఇండియాలోనే నంబర్ వన్ ఐటీ మినిస్టర్ అని మ‌ల్లారెడ్డి ప్ర‌శంసించారు. ``కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇండియాలో ఆపిల్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్నింట్లో మనమే బెస్ట్ ఉన్నాం.

కేటీఆర్ వల్ల హైదరాబాద్ కు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఒకపుడు ఐటీ కంపెనీలు అన్నీ నార్త్ లోనే ఉండేవి.. ఇప్పుడు సౌత్ కు వస్తున్నాయి...ఇది మన అదృష్టం.

కొంపల్లి - మేడ్చల్ చుట్టూ లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. టీఆర్ఎస్ అంటే గులాబీ పూలు అనుకున్నారా... ఫైర్... ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదు. బీజేపీ, కాంగ్రెస్ పోటీ రాలేవు`` అని త‌న‌దైన శైలిలో మంత్రి మ‌ల్లారెడ్డి వివ‌రించారు.
Tags:    

Similar News