ఎమ్మెల్సీ లిస్ట్ చూసిన ఆశావహులు తమ పేరు లేదని ఆవేదన చెందుతున్నారు. అనూహ్యమైన పేర్లు అన్నీ అందులో ఉన్నాయని వాపోతున్నారు. అయితే వారెవరికీ అధినాయకత్వాన్న్ని అడిగే ధైర్యం అయితే లేదని టాక్. తమలో తామే కుమిలిపోతూ తమకు అన్యాయం జరిగిందని మధనపడుతున్నారు. ఆ నాయకుల కధ అలా ఉంటే ఈ లిస్ట్ చూసి ఫ్యూచర్ లో ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయన్నది కూడా లెక్కసుకుంటున్నారు.
గతంలో ఎమ్మెల్సీలుగా ఉంటూ ప్రస్తుతం లిస్ట్ లో కనిపించని వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఒక అంచనాకు వస్తున్నారు. అలా కనుక చూసుకుంటే గుంటూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం మార్చి 29తో ముగుస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అటు నుంచి వైసీపీలోకి వచ్చారు.
అలా వచ్చే ముందు తమ ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేశారు. అయితే జగన్ తిరిగి ఆ సీటుని ఆయనకే ఇచ్చారు. ఇపుడు ఆ పదవీకాలం పూర్తి అయింది. ఆయంతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా మహిళా నాయకులురాలు పోతున సునీతకు మరో ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీ సీటుని రెన్యూవల్ చేశారు. మాణిక్య వరప్రసాద్ పేరు మాత్రం లిస్ట్ లో లేదు.
దాంతో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు కానీ తాడికొండ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గంలో మాత్రం కలవరం రేగుతోంది అని అంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ ని ఇంచార్జిగా జగన్ నియమించి కలకలం రేపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఆయనకు ఇంచార్జి పదవి ఎలా ఇస్తారని అప్పట్లో రచ్చ సాగింది. దీని మీద ఉండవల్లి శ్రీదేవి అయితే అలిగారు, అసంతృప్తి చెందారు అని కూడా వార్తలు వచ్చాయి.
చివరికి అది కొంత సద్దుమణిగినా అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి. ఇపుడు అవి కాస్తా నిజమయ్యేలా ఉన్నాయని అంటున్నారు. అదేలా అంటే డొక్కాకు ఎమ్మెల్సీ సీటు లేదు కాబట్టి ఆయన్ని కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా తాడికొండ నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దింపుతారు అని అంటున్నారు.
ఇక ఎమ్మెల్యే శ్రీదేవి విషయానికి వస్తే ఆమె హైదరాబాద్ లో వైద్య వృత్తిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమెను తెచ్చి పోటీ చేయించారు. జగన్ వేవ్ లో ఘన విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలు టఫ్ గా ఉంటాయి. ఆమె చూస్తే నియోజకవర్గంలో ఉండరని అంటారు. పైగా అక్కడ మూడు గ్రూపులు ఉన్నాయి. ఎంపీ నందిగం సురేష్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఇపుడు డొక్కా కూడా అక్కడ కీలకంగా ఉన్నారు. దాంతో పాటు క్యాడర్ లో కూడా ఎక్కువ మంది ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు.
ఈ పరిణామాలను అన్నింటినీ బేరీజు వేసుకున్న తరువాత అధినాయకత్వం డొక్కాను అక్కడ ఇంచార్జిగా చేసింది అని అంటున్నారు. ఇపుడు ఏకంగా ఆయనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించడం కోసమే ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన వారు అర్ధం చేసుకున్నదేంటి అంటే తాడికొండ సీటు నుంచి లేడీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టికెట్ కష్టమే అని.
ఇక ఆమె రాజకీయం ఇక్కడితే సరి అని చెప్పడానికే పక్కా లెక్కలతోనే డొక్కాను అక్కడ బరిలో నిలబెట్టబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ పరిణమాల మీద ఉండవల్లి శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విశేషం ఏంటి అంటే ఆమె జగన్ కుటుంబానికి సన్నిహితురాలు అని అంటున్నారు. మరి తమ సన్నిహితులకే ఈ విధంగా చెక్ పెడుతున్న జగన్ రానున్న ఎన్నికల్లో ఎంతమందికి టికెట్ చించేస్తారో అన్న టెన్షన్ అయితే ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.