తమిళనాడు అధికారపక్షమై అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం గురించి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అన్న రీతిలో ఒకదాని తర్వాత మరొకటిగా సాగుతున్న పరిణామాలతో చెన్నై కేంద్రంగా ఇప్పుడు హాట్ హాట్ వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం నుంచి నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేల్ని తరలించిన చిన్నమ్మ.. వారిని రహస్య ప్రదేశానికి పంపినట్లుగా వార్తలు వచ్చాయి.
మరి.. వారంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలకుసమాధానాలు లభించని వేళ.. ఒక జాతీయ మీడియా సంస్థ ఒకటి.. క్యాంప్ లకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ట్రేస్ చేసే ప్రయత్నం చేసింది. నాలుగు బస్సుల్లో ఐదు బృందాలుగా విడిపోయిన వారిలో ఒక బృందాన్ని సదరు మీడియా సంస్థ గుర్తించినట్లుగా పేర్కొంది.
చెన్నైకి 80కిలోమీటర్ల దూరంలో మహాబలిపురానికి తీసుకెళ్లిన శశి బృందం.. అక్కడి గోల్డెన్ బే రిసార్ట్ కు తీసుకెళ్లింది. వారికి సకల సౌకర్యాలు అందించినట్లుగా వెల్లడించింది. ఈ రిసార్ట్స్ లో బీచ్.. మసాజ్ లు.. వాటర్ స్కైయింగ్ లాంటి ఎన్నో ఏర్పాట్లను చేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల దగ్గర ఉన్నఫోన్లనుముందే తీసేసుకున్న చిన్నమ్మ బృందం వారంతా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారని.. వారు ఎలాంటి టెన్షన్ లేకుండా రిసార్ట్స్ లో గడుపుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహాబలిపురానికి తరలించిన బృందంలో ఎస్పీ షణ్ముగనాథన్ అనే వ్యక్తి మాత్రం బాత్రూం బ్రేక్ అని చెప్పి వెళ్లి.. మళ్లీ తిరిగి రాలేదని చెబుతున్నారు. ఇక.. ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ వద్ద సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఏ స్థాయిలో అయితే భద్రతా ఏర్పాట్లు చేస్తారో అదే స్థాయిలో ఏర్పాట్లు చేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/