సీనియర్ నటి సుమలత కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకోవడం తెలిసిందే. సుమలత భర్త దివంగత అంబరీష్ ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా వరసగా మూడు సార్లు గెలిచారు. కానీ సుమలతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆవిడ ఇండిపెండెంట్ గా బరిలో నిలిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో జేడీ (ఎస్) తరఫున కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలో నిలవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది.
సుమలతకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి భారీగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరోలు దర్శన్.. 'కేజీఎఫ్' స్టార్ యష్ ఆమెకు మద్దతు నిలిచారు. ఇది నచ్చని ఇతర పార్టీల వారు ఈ స్టార్ హీరోలపై కారాలుమిరియాలు నూరుతున్నారట. శనివారం ఉదయం రాజరాజేశ్వరి నగర్ లోని దర్శన్ నివాసంపై ఒక గుర్తు తెలియని దుండగుడు రాళ్ళు రువ్వాడట. ఈ ఘటనలో ఆస్తి నష్టం కూడా జరిగిందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. సిసిటీవీ ఫుటేజ్ ను తీసుకొని దుండగులను గుర్తిస్తామని వారిపై చర్యతీసుకుంటామని అంటున్నారు.
ఈ సంఘటన తర్వాత.. ముందు జాగ్రత్త చర్యగా హొసకెరెహళ్ళి ఏరియాలోని యష్ నివాసానికి సెక్యూరిటీ కలిపించారు. ఇద్దరు పోలీసులను యష్ ఇంటిదగ్గర సెక్యూరిటీ గా నియమించామని.. అవసరమైతే ఇంకా పెంచుతామని పోలీస్ శాఖవారు చెబుతున్నారు.