కరోనా మహమ్మారితో దేశం అతలాకుతలం అవుతుంది. కరోనా బాధితులను కాపాడటం కోసం, -అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టటం కోసం దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే హాస్పిటల్స్ లో మొబైల్ ఫోన్ల వాడకం పట్ల చోటు చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది . హాస్పిటల్ లోపల మొబైల్ ఫోన్ ల వాడకాన్ని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రోగుల సహాయార్థం ల్యండ్ లైన్స్ ఏర్పాటు చేస్తామని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా బుధవారం తెలిపారు.
కోల్ కతాలోని బాంగూర్ హాస్పిటల్ లో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులో రెండు మృతదేహాలను వైద్య సిబ్బంది గంటల కొద్ది అలాగే వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది కరోనా రోగులు రెండు మృతదేహాలకు చాలా దగ్గర్లోనే కూర్చొని ఉన్నారు. డెడ్ బాడీస్ ని తక్షణమే తీసెకెళ్లాల్సిందిగా బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ కరోనా రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనితో ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.దీంతో మమత సర్కార్ ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ...వీడియో వైరల్ కావడంతోనే హాస్పిటల్స్ లోపల మొబైల్ ఫోన్లను నిషేదించారని మమతాసర్కార్ పై ఆరోపణలు గుప్పించారు. నిజాలను నొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది అని , అలాగే ఈ వైరల్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంత్రి..ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మాత్రం దీనిపై స్పందించట్లేదని, కనీసం అది నకిలీ వీడియో అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .