దేశానికి మోడీ ఓకే.. రాష్ట్రాలకు నాట్ ఓకే

Update: 2019-11-20 07:15 GMT
నరేంద్రమోడీ v/s రాహుల్ గాంధీ.. ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ అని దేశ ప్రజలను కోరితే అంతా నరేంద్రమోడీ బెటర్ అంటూ ఆయన్నే గెలిపించారు. రాహుల్ శక్తి సామర్థ్యాలు, చంచలత్వం చూసి ఓడించారు. అయితే రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం జనాలు నరేంద్రమోడీ పార్టీని ఓడిస్తున్నారు. దేశానికి మోడీ ఓకే కానీ.. రాష్ట్రాలకు మాత్రం నాట్ ఓకే అని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా రాజస్థాన్ లో జరిగిన 49 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని చాటింది. మొత్తం రాజస్థాన్ లోని 24 జిల్లాల్లో 49 స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో 20 సంస్థలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం విశేషం. ఇక బీజేపీ కేవలం ఆరు పట్టణ సంస్థల్లో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది. ఇక స్వతంత్రులు, ఎన్ సీపీ, బీఎస్సీ, సీపీఎం లు మిగతా స్థానాలను గెలుచుకున్నాయి.

ప్రస్తుతం రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి పట్టం కట్టారు. అయితే అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ నే గెలిపించడం విశేషం.

ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటర్లు ఇలాంటి తీర్పునే ఇచ్చారు. కేవలం 5 నెలల్లోనే మహారాష్ట్రలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి షాకిచ్చారు.  అసెంబ్లీ ఏర్పాటుకు మ్యాజిక్ మార్క్ మెజార్టీ సీట్లు ఇవ్వకుండా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లను గెలిపించారు.

దీన్ని బట్టి దేశానికి మోడీ అవసరం ఉంది కానీ.. రాష్ట్రాలకు మాత్రం కాదని దేశ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్ కనుక బలంగా ఉంటే.. రాహుల్ స్థానంలో మోడీని ఎదుర్కొనే బలమైన నేత కనుక ప్రజలకు కనిపిస్తే ఈ ఫలితాలు దేశమంతా ప్రస్ఫుటిస్తాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బలమైన వాడు కాకపోవడం వల్లే మోడీ గెలుస్తున్నాడా? నిజంగా మోడీకి ధీటైన నేత ఉంటే మోడీని కూడా ప్రజలు ఓడిస్తారా అన్న అనుమానాలను తాజాగా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News