కీలకమైన సమయాల్లో పాకిస్తాన్ బూచిని చూపుతారు అనే పేరును తెచ్చుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్లు. ఎన్నికల సమయాల్లో తాము డిఫెన్స్ లో పడిన ప్రతి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ ప్రస్తావన తెస్తుందని, పాక్ మీద యుద్ధం లేదా దాడులు అంటుందని కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఓపెన్ గానే విమర్శిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి పాకిస్తాన్ ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. పౌరసత్వం చట్టం సవరణల బిల్లు విషయంలో విపక్షాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. మరోవైపు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు రోడ్డుకు ఎక్కుతున్నారు.
భారతీయ జనతా పార్టీ విధానాలను తప్పు పట్టే వారు ఈ అంశంపై స్పందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరసగా స్పందిస్తూనే ఉన్నారు. అల్లర్లు వద్దని ఒకవైపు ఆయన హితవు పలుకుతూ ఉన్నారు. మరోవైపు సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు మోడీ.
అల్లర్లను చేస్తున్నది ఒక వర్గం వారే అని ఇది వరకే మోడీ వ్యాఖ్యానించారు. వారు ధరించే దుస్తులను బట్టి అల్లర్లు చేస్తున్నది ఎవరో గుర్తుపట్టవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలే అల్లర్లు చేస్తున్నారన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిరసన తెలుపుతున్న అనేక మంది విద్యార్థులు తాము ముస్లింలం కాదని ప్రకటించుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. మోడీ మరోసారి స్పందించారు. పౌరసత్వం చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలకు దమ్ముంటే.. పాకిస్తానీయులకు పౌరసత్వం ఇస్తామంటూ ప్రకటించాలని మోడీ సవాల్ విసిరారు. ఇలా మరో అంశంపై పాకిస్తాన్ సెంటిమెంట్ ను ప్రయోగించారు మోడీ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.\